టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవ‌లె `త‌మ్ముడు` మూవీతో బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. కానీ నిరాశే ఎదురైంది. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. నితిన్ 2020లో ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. త‌న ప్రేయ‌సి షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్‌ వివాహం చేసుకున్నాడు.


కోవిడ్-19 కార‌ణంగా కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ సింపుల్‌గా నితిన్‌, షాలినిల వివాహం జ‌రిగింది. ఈ దంప‌తులు 2024 సెప్టెంబరులో త‌మ మొద‌టి బిడ్డ‌కు వెల్క‌మ్ చెప్పారు. నితిన్ తో త‌న ప్రేమ బంధానికి ప్రతీకగా షాలిని పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే చాలా మంది సెల‌బ్రిటీల మాదిరిగానే నితిన్ కూడా కొడుకు పుట్టాడ‌న్న గుడ్ న్యూస్‌ను పంచుకున్నాడు త‌ప్ప బాబు ఫేస్ మాత్రం చూపించ‌లేదు.
అయితే శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ‌నివారం నితిన్ దంప‌తులు త‌మ‌ కొడుకు పేరును రివీల్ చేశారు. త‌మ ముద్దుల కృష్ణ‌య్య‌కు `అవ్యుక్త్` అని పేరు పెట్టినట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. దాంతో నెటిజ‌న్లు `నైస్‌ నేమ్‌`, `పేరు భ‌లే వెరైటీగా ఉంది` అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా, నితిన్ అప్ క‌మింగ్ మూవీస్ విష‌యానికి వ‌స్తే.. `బలగం` ఫేమ్ వేణు యెల్దండి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా లాక్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: