సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వచ్చి పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం తమ అందం, నటన, సింప్లిసిటీతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తారు. అటువంటి వారిలో నివేదా థామస్ ఒకరు. చిన్నారిగా వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. 2002లో మలయాళ సినిమా ఉత్తర ద్వారా బాలనటిగా తన సినీ ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత మై డియర్ భూతం వంటి టీవీ సీరియల్స్‌తో చిన్నపిల్లల్ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా తాను చూపించిన ప్రతిభను, అందాన్ని చూసి అప్పట్నుంచే ఈ అమ్మాయి పెద్ద స్టార్ అవుతుందని చాలామంది చెప్పేవారు.

2016లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నివేదా, తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. నిన్ను కోరిలో నానితో జంటగా మెప్పించింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జై లవకుశలో కనిపించి కుర్రాళ్ళ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ లో, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో దర్బార్ లో నటించి తన రేంజ్‌ను పెంచుకుంది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే సింపుల్ లుక్స్, స్క్రీన్‌పై ఓ సెకండ్‌కి కూడా మిస్సవ్వనివ్వని నటన – ఇవన్నీ కలిపి నివేదాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే సోషల్ మీడియాలో కూడా ఈ భామకి యూత్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నటనలో టాప్ క్లాస్‌ ఉన్నా, అవకాశాల పరంగా మాత్రం ఆశించినంతగా దక్కకపోవడం ఒక లోటు.

ఇటీవలే విడుదలైన 35 – చిన్న కథ కాదు సినిమాలో తొలిసారిగా అమ్మ పాత్రలో నటించి, అందరినీ షాక్ చేసింది. అందం మాత్రమే కాదు .. ఏ రోల్‌ ఇచ్చినా తనదైన నైజంతో ప్రాణం పోసే నటి అని మళ్లీ నిరూపించుకుంది. ఈ మూవీ ఓటీటీలో సూపర్ హిట్ అవ్వడంతో నివేదా కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. 1995 నవంబర్ 2న కేరళలోని కన్నూరులో పుట్టిన నివేదా, పేరుకు మలయాళి అయినా తెలుగులోనే తనకున్న క్రేజ్ ఎక్కువ. ప్రస్తుతం కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ భామ, సోషల్ మీడియాలో తన తమ్ముడితో చేసే ఫన్నీ వీడియోలతో కూడా ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేస్తోంది. క్రేజీ స్టార్ హీరోలతో జంటగా మెరిసిన నివేదా థామస్, తన టాలెంట్‌తో ఇంకా టాలీవుడ్‌లో మంచి స్థానం సంపాదించుకోవడం ఖాయం. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా నిలిచిన ఈ భామ, ఎప్పుడైనా ఒక పెద్ద హిట్‌తో మళ్లీ టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: