మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి  ఓ వైపు విశ్వంభర సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఇలా రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న చిరంజీవి ఇప్పటికే తనకు వాల్టేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన బాబి కొల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాబి , చిరంజీవి కోసం ఒక కథను తయారు చేసినట్లు , దానిని చిరంజీవి కి వినిపించినట్లు , చిరంజీవి కూడా ఆ కథ విని బాబీ ని ప్రశంసించి మరోసారి బాబీ దర్శకత్వంలోకి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈసారి చిరంజీవి ని సరికొత్తగా చూపించేందుకు బాబీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చిరు , బాబీ కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి ని బాబి తన మూవీ లో చాలా కొత్తగా చూపించబోతున్నట్లు అందులో భాగంగా చిరంజీవి ని బాబి తన సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి గ్యాంగ్ స్టార్ పాత్రలో ఎక్కువ శాతం నటించలేదు. దానితో చిరంజీవి గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించబోతున్నాడు అనే వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పవన్ కూడా గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. చిరంజీవి ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: