కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఈయనకు దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చిన సినిమాలలో ఖైదీ మూవీ ఒకటి. ఈ సినిమాలో కార్తీ హీరో గా నటించాడు. ఈ మూవీ మామూలు అంచనాల నడుమ విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఈ సినిమాను రూపొందించిన విధానానికి గాను లోకేష్ కి అద్భుతమైన ప్రశంశాలు దక్కాయి. ఈ సినిమా చివరన ఖైదీ మూవీ కి కొనసాగింపుగా ఖైదీ 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఖైదీ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఆ వెంటనే లోకేష్ "ఖైదీ 2" మూవీ ని మొదలు పెడతాడు అని చాలా మంది భావించారు. కానీ ఆ తర్వాత ఈయన తలపతి విజయ్ హీరోగా మాస్టర్ మూవీ ని రూపొందించాడు.  ఆ తర్వాత లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా విక్రమ్ సినిమాను రూపొందించాడు. ఆ తర్వాత తలపతి విజయ్ హీరోగా లియో సినిమాను రూపొందించాడు. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా కూలీ అనే మూవీ ని రూపొందించాడు. కానీ ఇప్పటివరకు లోకేష్ "ఖైదీ" సినిమాను మాత్రం మొదలు పెట్టలేదు ఇకపోతే కూలీ మూవీ తర్వాత ఖైదీ పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది అని అనేక వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది.

లోకేష్ తన తదుపరి మూవీ గా ఖైదీ 2 ను కాకుండా కమల్ హాసన్ , రజనీ కాంత్ హీరోలుగా ఓ మూవీ ని చేయాలి అని భావిస్తున్నట్లు , ఆ సినిమా తర్వాతే ఖైదీ 2 ఉండే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త గనుక నిజం అయితే కార్తీ అభిమానులు ఖైదీ 2 మూవీ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk