పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక టాలీవుడ్ హీరోలు ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకుపోతున్నారు. బాలీవుడ్ స్టార్స్ ను సైతం డామినేట్ చేసి పడేస్తున్నారు. నేషనల్ వైడ్‌ గానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌ గా కూడా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇకపోతే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) గత నెల జూలైలో ఇండియాస్ మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఎవరు అన్న లిస్టును విడుదల చేసింది. అయితే ఎప్పటిలాగానే బాలీవుడ్ ఖాన్లు, కపూర్ లను వెనక్కి నెట్టి టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ అగ్ర‌స్థానంలో నిలిచాడు.


అలాగే టాప్-10లో టాలీవుడ్ నుంచి ఆరుగురు హీరోలు చోటు దక్కించుకుని పైచేయి సాధించారు. ఐఎండీబీ ప్రకారం జూలై నెలకు గాను ఇండియాస్ మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ లో ప్రభాస్ టాప్ వన్ లో నిలిచారు. అలాగే రెండో స్థానాన్ని తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ మూడో స్థానంలో ఉంటే.. టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిచారు.


టాప్ 5లో కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అజిత్ కుమార్ ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. `ఆర్ఆర్ఆర్‌`తో గ్లోబ‌ర్ స్టార్స్ గా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 7, 8 స్థానాల్లో ఉంటే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టాప్ 9లో నిలిచారు. ఇక 10వ‌ స్థానాన్ని అంత‌కు ముందు నెల‌లో న్యాచురల్ స్టార్ నాని సొంతం చేసుకోగా.. జూలైలో హరిహర వీరమల్లు విడుదల కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాని ప్లేస్‌ను రీప్లేస్ చేయ‌డం జ‌రిగింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: