సమంత ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా కాకుండా, సినిమాల నుంచి కొంత దూరంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి మంచి సినిమా ఆఫర్లు, డైరెక్టర్స్ ఆమె వద్దకు వచ్చినా కూడా చేయకుండా సైలెంట్‌గా ఉంటోంది. దీంతో, “సినిమాలకు ఎందుకు కమిట్ అవ్వడం లేదు?” అంటూ ఈ మధ్యకాలంలో అభిమానులు రకరకాలుగా ప్రశ్నించారు. తాజాగా సమంత ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఆమె గ్రాజియా ఇండియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. దీంతో అభిమానులకు పూర్తి క్లారిటీ వచ్చింది.


సమంత మాట్లాడుతూ ..“ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యం. నేను కథలను ఎంచుకునేటప్పుడు అదే దృష్టిలో పెట్టుకుంటాను. ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గతంతో పోలిస్తే నాలో చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి ఎదిగాను. ఇప్పటివరకు సినిమాలపైనే కాన్సన్‌ట్రేట్ చేశాను. నేను చేసిన సినిమాలు కేవలం కమర్షియల్ సక్సెస్ కోసం కాదు, నా మనసుకు దగ్గరగా ఉన్నవే. ఇప్పుడు నా వర్క్ ప్లానింగ్‌లో మార్పులు చేసుకుంటున్నాను.



ఫిట్నెస్‌కి, సినిమాలకు సమాన న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇకపై ఎక్కువ సినిమాలు చేయను. నా మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను. ఒకేసారి ఐదు ఆరు ప్రాజెక్టులు చేయను. ప్రాజెక్టుల సంఖ్య తక్కువైనా, వాటి నాణ్యత మాత్రం ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను. మంచి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాను” అని చెప్పుకొచ్చింది. ఇలా సమంత చెప్పిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు – “ఇకపై సమంత చాలా అరుదుగానే సినిమాలు చేస్తుంది” అని ఫిక్స్ అయ్యారు. కొందరు అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే, ఆమె ఆరోగ్యాన్ని ముందుగా ఆలోచిస్తుందని, సినిమాల గురించి అంతగా ఆలోచించబోనని క్లారిటీ కి వచ్చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: