హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ ప్రవీణ్ కందిరీగుల కాంబినేషన్లో వచ్చిన చిత్రం పరదా. ఈ సినిమా ట్రైలర్ నుంచి భారీగానే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ప్రమోషన్స్ కూడా చాలా విభిన్నంగా చేయడంతో మరింత అంచనాలను పెంచేసింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజున థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.



స్టోరీ విషయానికి వస్తే:
పడతి గ్రామంలో ఉండే జ్వాలమ్మ అమ్మవారి కథని ఆధారంగా చేసుకుని.. ఆ ఊరిలో మహిళలు అందరూ  ముఖాలకు పరదాలు వేసుకొని మరి జీవిస్తూ ఉంటారు.. అలాంటి గ్రామంలో సుబ్బ(అనుపమ) ఉంటుంది. పరదా తీస్తే పిల్లలు పుట్టారనే శాపం ఆ ఊరికి ఉందనే నమ్మకాన్ని ఆ ఊరి ప్రజలంతా నమ్ముతూ ఉంటారు. ఎవరైనా ఆ పరదా తీస్తే ఆత్మహుతి అనే పేరుతో చంపేస్తూ ఉంటారు.. అలాంటి ఊర్లో నుంచి సుబ్బు బయట ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. మరి సుబ్బు ఎందుకు ఊరు వదిలి వెళ్ళింది?. అక్కడ ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అనేది సినిమా కథ.


నటన:
డైరెక్టర్ ప్రవీణ్ కందిరీగుల ఈ సినిమా కథను చాలా సున్నితంగానే తెరకెక్కించారు. చాలా బాగోద్వేగకరమైన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొదటి భాగం ఎమోషనల్ తో చాలా డీసెంట్ గా కొనసాగుతుంది.. ఇక రెండవ భాగంలో కొన్నిచోట్ల నెమ్మదిగా సాగినప్పటికీ కథలో చాలా ముఖ్యమైన సన్నివేశాలను ఎమోషనల్ గా చూపించి డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారని నేటిజన్స్ తెలుపుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను సినిమా మార్చేస్తుందని.. చివరి 20 నిమిషాలు హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో భారీ హైప్ తో కమర్షియల్ సినిమాలలోగా ఎలివేషన్స్ తో ముగింపు పలికారని ప్రేక్షకులు తెలుపుతున్నారు.


ఈ చిత్రానికి హైలైట్ గా అనుపమనే నిలిచింది.. సుబ్బు పాత్రలో జీవించేసిందని చెప్పవచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, రఘు మయూర్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.


ప్లస్ పాయింట్స్:
అనుపమ పరమేశ్వరన్ నటన
స్టోరీ, మొదటి భాగం
అలాగే గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్:
సెకండ్ హాఫ్ లో వచ్చి కొన్ని సాగదీత సన్నివేశాలు


ఈ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ.. అనుపమ యాక్టింగ్, డైరెక్టర్ పని తీరుతో చూడవచ్చు. ఈ సినిమా మూఢనమ్మకాలతో మహిళలను కట్టడి చేస్తున్నారనే ఒక మంచి సందేశం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం అన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి లేని ఓరియంటెడ్ సినిమాతో అనుపమ సక్సెస్ కొట్టిందని అభిమానులు భావిస్తున్నారు.


రేటింగ్:
2.8/5

మరింత సమాచారం తెలుసుకోండి: