ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోలను మేకర్స్ విడుదల చేశారు. వాటి ద్వారానే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని క్లియర్గా అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే అట్లీ ఆఖరుగా బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్ల గొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం అట్లీ , బన్నీ తో రూపొందిస్తున్న సినిమా విషయంలో కూడా జవాన్ మూవీ ఫార్ములా ను ఫాలో కాబోతున్నట్టు తెలుస్తుంది. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ..? జవాన్ మూవీ లో తమిళ నటుడు తలపతి విజయ్ విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే అట్లీ ప్రస్తుతం బన్నీ తో రూపొందిస్తున్న సినిమాలో కూడా విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ఆయన పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పుష్ప లాంటి భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ కావడం , జవాన్ లాంటి అద్భుతమైన విజయం తర్వాత అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ తో బన్నీ , అట్లీ ఇద్దరికీ ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి. ఈ మూవీ లో దీపిక పదుకొనేతో పాటు మరి కొంత మంది బ్యూటీ లు కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: