పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది.. అనే డైలాగ్ ఏ సినిమాలో ఉంటుంది.. హా మాకు తెలియదా అది రజినీకాంత్ నటించిన శివాజీ మూవీ లోది అంటారు. అయితే ఈ డైలాగ్ ని చాలామంది తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా వాడుకున్నారు. అయితే ఇప్పుడు తమిళ తలపతి విజయ్ వంతు వచ్చింది.ఎందుకంటే  తాజాగా ఆయన ఒక భారీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కి జన సమూహం ఎంతలా వచ్చారో ఇప్పటికే చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి.అయితే ఈ మీటింగ్ లో ఓ హీరోని ఉద్దేశించి విజయ్ తలపతి పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది నేను సింహాన్ని సింగల్ గానే రాజకీయాల్లోకి వెళ్తాను అంటూ మాట్లాడారు. 

అయితే ఈ డైలాగ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే విజయ్ తలపతి అన్నారు అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి రెండో మహానాడు సభని మదురై జిల్లా పారపర్తిలో పెట్టారు.తమిళనాడులో 2026 లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్  గా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తలపతి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను సింహాన్ని.. ఈ జన సమూహం గుంపు ని ఓట్ల కోసమే కాదు పాలకులను వెంటాడేందుకు కూడా అంటూ మాట్లాడారు. ఎందుకంటే సభలకు గుంపులుగా వచ్చిన వాళ్లందరూ ఓట్లు వేయరు కదా అని మాట్లాడారు.

ఆ విమర్శలకి కౌంటర్ గానే ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అందుకే నేను సింహం లాంటోన్ని ఒంటరిగానే రాజకీయాల్లోకి వస్తా అంటూ డైలాగ్ కొట్టారు. అయితే విజయ్ తలపతి కొట్టిన ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేక చివరికి టిడిపి, బిజెపి లతో పొత్తు పెట్టుకుని గుంపుగా ఏర్పడ్డారు. ఆ తర్వాతే అధికారంలోకి వచ్చారు. కానీ నేను పవన్ కళ్యాణ్ లాగా పోటీ చేయను సింహం సింగిల్ అన్నట్టు సింగిల్గానే వస్తాను అని పవన్ కళ్యాణ్ పై విజయ్ తలపతి సెటైర్ వేశారంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: