చిరంజీవి బాలకృష్ణ కాంబోలో మూవీ వింటుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది కదూ.. మరి అలాంటిది వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వదు.. కచ్చితంగా అవుతుంది.. కానీ ఇద్దరు స్టార్ హీరోలే. ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరినీ సినిమాలో ఏ ఒక్క దగ్గర తక్కువ చేసి చూపించిన కూడా అభిమానులు అస్సలు ఊరుకోరు. బయట పెద్ద యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా చేయడానికి దర్శకులు అంత ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే ఏమాత్రం తేడా కొట్టిన దర్శకుడికి దెబ్బలు పడతాయి. అందుకే చాలామంది దర్శకులు వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ చేయాలి అనుకున్నప్పటికీ వీరిద్దరికీ ఉన్న భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ దృష్ట్యా వెనక్కి తగ్గారు. 

అయితే తాజాగా బాలకృష్ణ చిరంజీవి కాంబోలో సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు అనిల్ రావిపూడి.. దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.అయితే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ ప్రెస్ మీట్ లో భాగంగా కొంతమంది విలేకరులు చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా ఎప్పుడు తెరకెక్కించబోతున్నారు అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ.. వెంకటేష్ చిరంజీవి లతో నా ప్రయాణం మొదలైంది.

అయితే గతంలో చిరంజీవి గారు అవకాశం ఉంటే బాలకృష్ణతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.కానీ ఈ ఇద్దరు హీరోలు డిఫరెంట్ మేనరిజం ని కలిగి ఉంటారు. అందుకే ఈ ఇద్దరు హీరోలకు తగ్గట్టుగా ఉండే పర్ఫెక్ట్ కథ దొరకాలి కదా.. వీరిద్దరికీ సరిపోయే కథ దొరికినప్పుడు సినిమా గురించి ఆలోచిద్దాం అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు అనిల్ రావిపూడి.ఏది ఏమైనప్పటికీ చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే అంటున్నారు వఈ హీరోల ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: