సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలకు ఒకటి , రెండు వరస ప్లాప్స్ వచ్చాయి అంటే చాలు వారి క్రేజ్ తగ్గిపోవడం , ఆ తర్వాత వారి మార్కెట్ పడిపోవడం , దర్శక , నిర్మాతలు కూడా ఆ హీరోతో సినిమా చేయడానికి వెనకాడడం జరుగుతూ ఉంటుంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ హీరోకు వరుసగా ఆరు సినిమాలతో అపజయాలు వచ్చినా కూడా అతనితో సినిమా చేయడానికి దర్శక , నిర్మాతలు ఎగబడుతున్నారు. అలాగే భారీ బడ్జెట్ సినిమాలను ఆయనతో రూపొందిస్తున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు విజయ్ దేవరకొండ.

ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈయన నటించిన సినిమాలలో పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీవాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఈ సినిమాలు తక్కువ గ్యాప్ లో వచ్చి మంచి విజయాలు సాధించడంతో విజయ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు తక్కువ కాలంలో వచ్చింది. ఇకపోతే టాక్సీవాలా సినిమా తర్వాత ఈయన నటించిన ఆరు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. విజయ్ "టాక్సీవాలా" సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. 

ఆ తర్వాత ఈయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈయన నటించిన లైగర్ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈయన నటించిన ఖుషి సినిమా యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకోగా , ది ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక తాజాగా విజయ్ "కింగ్డమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd