
అయితే నిన్న చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఒక డైరెక్టర్ పెట్టిన పోస్ట్ మాత్రం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు అలా ఏ డైరెక్టర్ పోస్ట్ చేయకపోవడం గమనార్హం. కనీసం మెగా కుటుంబ సభ్యులు కూడా ఆయనను ఆ స్థాయిలో పొగడలేదు. అంతలా ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు.. శ్రీకాంత్ ఓదెల. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ, చిరంజీవిని ప్రశంసిస్తూ, తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో వివరించారు. ఆయన చేసిన పోస్ట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారేలా చేసింది.
“నా చిరంజీవిని మిస్ అవుతూ వచ్చాను. ఆయనని నేను వెనక్కి తీసుకొస్తాను… ఇది రక్తంతో చేస్తున్న ప్రమాణం” అంటూ ఓ రేంజ్‌లో భారీ డైలాగ్స్ రాశారు. ఆయన ట్వీట్ చేస్తూ ..“నువ్వు నా దేవుడివి. చిరంజీవితో ఒక ఫోటో దిగితే ఇంట్లో అమ్మకు చూపించాను. అప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఫోటోలో నవ్వడం చూశానని అమ్మ చెప్పింది. అదే చిరంజీవి డెఫినిషన్. చిరంజీవి ఏం చేయగలడు అంటే – నా లాంటి ఇంట్రోవర్ట్ చేసే వ్యక్తితో ఇంద్ర స్టెప్ చేయించగలడు, సినిమా టికెట్లు కొనుక్కునే వాడితో సినిమా తీయించగలడు. చిరంజీవితో సినిమా అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఫైనల్‌గా – చిరంజీవి ని స్క్రీన్‌పై మిస్ అవుతున్న. నేను ప్రామిస్ చేస్తున్నా… ఆ చిరంజీవిని మళ్లీ మీ ముందుకు తీసుకొస్తాను. నాకోసం నేనే తీస్తున్న సినిమా కాదు, నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా. ఇది నెత్తురుతో చేస్తున్న వాగ్దానం. హ్యాపీ బర్త్‌డే చిరంజీవి సార్” అంటూ ఓ రేంజ్‌లో పోస్ట్ షేర్ చేసి, చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ పోస్టు చూసిన తర్వాత చాలామంది శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ కి ఎంత పెద్ద అభిమాని అన్న విషయంపై మాట్లాడుకుంటుంటే, మరికొందరు మాత్రం “చిరంజీవి బర్త్‌డే నాడు చాలా ఓవర్ చేశాడు ఈ డైరెక్టర్” అంటూ ఘాటు కౌంటర్స్ కూడా వేశారు. చూడాలి మరి చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుందో అనేది..??