టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ "గంగోత్రి" సినిమా ద్వారా హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను అల్లు అరవింద్ , అశ్విని దత్ సంయుక్తంగా నిర్వహించారు. మరి ఈ సినిమా మొదలు కాకముందు అనేక ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ఏమిటి ..? అనేది క్లియర్గా తెలుసుకుందాం.

గంగోత్రి సినిమా కథ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ మూవీ కథతో చిరంజీవి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ హీరో గా సినిమా చేయాలి అని అశ్వినీ దత్ భావించాడట. అందులో భాగంగా ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పగా ఆయన మాత్రం చరణ్ ఎంట్రీ ఇప్పుడే కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్లాన్ చేద్దాం అని అన్నాడట. దానితో ఆ మూవీ కథను పక్కన పెట్టేసారట. ఇక అప్పటికే అల్లు అర్జున్ ను తేజ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాతో వెండి తెరకు పరిచయం చేయాలి అని ప్రయత్నాలు కంప్లీట్ అయ్యాయి. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.


దానితో అశ్విని దత్ ఇప్పటికే మన దగ్గర గంగోత్రి అనే స్టోరీ కంప్లీట్ అయి ఉంది. దానితో అల్లు అర్జున్ హీరోగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు అశ్వినీ దత్ వచ్చాడట. దానితో రాఘవేంద్రరావు కి ఆ విషయం చెప్పగా ఆయన కూడా ఓకే అన్నాడట. దానితో అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ , అల్లు అరవింద్ నిర్మాతలుగా గంగోత్రి మూవీ ని రూపొందించారట. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు , మంచి విజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa