ఏంటి తమన్నా అలాంటి సినిమాలో నటిస్తుందా.. ఈ విషయం తెలిసి సొంత అభిమానులే ఈమెనుఛీ కొడుతున్నారుగా.. ఇంతకీ తమన్నా చేయబోయా సినిమా ఏంటి.. ఎందుకు అభిమానులు సైతం తిడుతున్నారు.తమన్నా గత కొద్దిరోజుల నుండి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బోల్డ్ పాత్రలు చేయకపోవడం వల్ల నేను ఎన్నో పెద్ద సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని, నో కిస్ పాలసీని పక్కన పెట్టాకే నాకు వరుస అవకాశాలు వచ్చాయని, నా కండిషన్స్ నేను పక్కన పెట్టుకోవడం వల్లే బోల్డ్ పాత్రలు వచ్చి మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది తమన్నా. అయితే తమన్నా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నటి గా పేరైతే తెచ్చుకుంది కానీ పెద్ద హీరోల సినిమాల్లో కాస్త బోల్డ్ పాత్రల్లో ఛాన్స్ వస్తే నటించనని చెప్పింది. 

కానీ ఆ తర్వాత బోల్డ్ పాత్రల్లో చేయకూడదనే కండిషన్స్ ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తమన్నా దశ తిరిగిపోయింది.ప్రస్తుతం బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తమన్నా తాజాగా ఓ షాకింగ్ సినిమాలో నటించబోతుంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ తమన్నా నటించబోయే సినిమా ఏంటి అంటే సన్నిలియోన్ నటించిన సినిమాకి తమన్నా సీక్వెల్ చేస్తుందట.ఇక బాలీవుడ్ లోని నిర్మాత దర్శకురాలు అయినటువంటి  ఏక్తాకపూర్ చేసే సినిమాలు అంటే ఏ విధంగా బోల్డ్ గా రొమాంటిక్ గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి ఎక్తాకపూర్ డైరెక్షన్లో తమన్నా తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టు బీటౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ ఎక్తాకపూర్ డైరెక్షన్ లో నటించిన రాగిణి ఎంఎంఎస్ 2 కి సీక్వెల్ గా రాబోతున్న రాగిణి ఎంఎంఎస్ 3 మూవీలో తమన్నా లీడ్ రోల్ పోషిస్తున్నట్టు బీటౌన్ వర్గాల్లో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజెన్లు తమన్నాని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఆ సినిమాలో చేస్తే మరో లెక్క అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక తమన్నా అభిమానుల సైతం ఈమెకు ఇదేం మాయ రోగం..ఇలాంటి సినిమాని ఒప్పుకుంది అంటూ తిట్టుకుంటున్నారు. మరి తమన్నా నిజంగానే రాగిణి ఎంఎంఎస్ 3 మూవీలో నటిస్తుందా.. లేక రూమర్సేనా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: