శ్రీ‌లీల మంచి యాక్ట‌ర్ అంత‌కు మించి గొప్ప డ్యాన్స‌ర్ అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. అయితే ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఏంటంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌ల్లే శ్రీ‌లీల హీరోయిన్ అయింద‌ట‌. శ్రీ‌లీల ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి ప్ర‌త్య‌క్ష్యంగా కాక‌పోయిన ప‌రోక్షంగా మాత్రం ఎన్టీఆరే కార‌ణం. ఈ విష‌యాన్ని శ్రీ‌లీల త‌ల్లి, డాక్ట‌ర్ స్వ‌ర్ణ‌ల‌త వెల్ల‌డించారు. తాజాగా ఈ త‌ల్లీకూతుళ్లు జ‌గ‌ప‌తిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షో `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా`లో పాల్గొన్నారు.


ఈ షోలో శ్రీ‌లీల త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించి ఎన్నో విశేషాలు పంచుకుంది. ఈ క్ర‌మంలోనే చిన్న వ‌య‌సులో ఎన్టీఆర్ కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన ఫోటోను జ‌గ‌ప‌తి స్క్రీన్‌పై చూపించ‌గా.. `నాకు కూతురు పుడితే డ్యాన్స్ నేర్పించాల‌ని నిర్ణ‌యించుకున్న క్ష‌ణాల‌ను గుర్తు చేసే ఫోటో ఇది` అంటూ స్వ‌ర్ణ‌ల‌త ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌పెట్టారు. 1997 లాస్ ఏంజెల్స్ లో జరిగిన తానా సభల్లో ఎన్టీఆర్ తో తొలిసారి మాట్లాడానని, అత‌ని స్పూర్తితోనే శ్రీలీలకు డ్యాన్స్ నేర్పించ‌డం జ‌రిగింద‌ని స్వ‌ర్ణ‌ల‌త పేర్కొన్నారు.


ఇక ప‌రోక్షంగా ఎన్టీఆర్ వ‌ల్ల డ్యాన్స్ నేర్చుకున్న శ్రీ‌లీల‌.. క్ర‌మంగా ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. చిన్న చిన్న పాత్ర‌ల‌తో ప్రారంభించి హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్‌లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. హీరోయిన్‌గా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే శ్రీ‌లీల నిల‌దొక్కుకుందీ అంటే అందుకు ఆమె అందం, అభిన‌యంతో పాటు డ్యాన్సింగ్ టాలెంట్ కూడా వ‌న్ ఆఫ్ ది మెయిన్ రీజ‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: