తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందున ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

తాజాగా తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా హీరో గా నటించాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందీ సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి అయినటువంటి యేష్ రాజ్ ఫిలిం సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ మొదటి రోజు లభించాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబట్టడంలో విఫలం అయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే తనకు వార్ 2 మూవీ ద్వారా ఆపజయాన్ని ఇచ్చిన యేష్ రాజ్ బ్యానర్ లో తారక్ మరో మూవీ చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమాను మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టనున్నట్లు కలుస్తుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీల తర్వాత తారక్ , యేష్ రాజ్ బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: