సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లు దాదాపుగా మంచి క్రేజ్ ఉన్న సమయంలో సమయాన్ని అస్సలు వృధా చేయకుండా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోయిన్లు క్రేజ్ ఉన్న సమయం లో వరుస పెట్టి సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే నటించడం కాకుండా ఐటమ్ సాంగ్స్ లలో నటించి కూడా పెద్ద ఎత్తున డబ్బులను సంపాదిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నా కూడా పెద్ద ఎత్తున సినిమాల్లో నటించకుండా చాలా తక్కువ సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి వారిలో సమంత ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సమంత కు అద్భుతమైన గుర్తింపు , క్రేజ్ ఉంది. కానీ సమంత ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల్లో అస్సలు నటించడం లేదు. ఆఖరుగా ఈమె విజయ్ దేవరకొండ హీరో గా శివ నిర్వన దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా తర్వాత ఈమె ఏ మూవీ లో కూడా నటించలేదు. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తాను ప్రస్తుతం ఎందుకు సినిమాల్లో నటించడం లేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.

తాజాగా సమంత మాట్లాడుతూ ... ప్రస్తుతం నేను సినిమాల్లో నటించడం కంటే కూడా నా హెల్త్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. అందుకే నేను ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు అని చెప్పుకొచ్చింది. అలాగే సమంత తాజాగా ప్రజెంట్ తన ఫోకస్ అంతా ఫిజికల్‌ అండ్ మెంటల్ హెల్త్ మీదే మాత్రమే ఉందని , ఒకే సారి నాలుగైదు సినిమాలు కూడా అస్సలు చేయనని తెలిపింది. అలాగే తక్కువ సినిమాలు చేసిన అవి ప్రజలను మెప్పించే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను అని కూడా సమంత తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: