తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ మాస్ ఈమేజ్ కలిగిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ నటులుగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. వీరు నటులుగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకొని అద్భుతమైన ఈమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికి కూడా వీరు సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమాల ద్వారా ఒకే రూట్ లో పయనిస్తున్నట్లు తెలుస్తుంది.

అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి చాలా కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో అత్యంత భారీ గ్రాఫిక్స్ ఉండబోతుంది. ఈ మూవీ గ్రాఫిక్స్ పనుల వల్లనే విడుదల డిలే అవుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంజి సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న గ్రాఫిక్స్ మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అఖండ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే అఖండ 2 మూవీ లో కూడా అత్యంత భారీ గ్రాఫిక్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరు కూడా భారీ గ్రాఫిక్స్ కలిగిన సినిమాల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలతో వీరు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: