యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ `వార్ 2` ఇటీవ‌ల భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. య‌శ్ రాజ్ ఫిల్మ్స్‌ అథిత్త్వంలో రూపొందిన ఈ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివ‌ర్స్‌ యొక్క 6వ భాగం. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్‌. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం కానుక‌గా ఆగ‌స్టు 14న విడుద‌లైన వార్ 2 ప్రేక్ష‌కుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.


హృతిక్‌-ఎన్టీఆర్ యాక్టింగ్‌, యాక్షన్ సీక్వెన్సులు ఆకర్షించే విధంగా ఉన్న‌ప్ప‌ట‌కిఈ.. కథాత్మకంగా కొత్తదనం లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. స్క్రీన్ ప్లే మ‌రియు వీఎఫ్ఎక్స్ పై కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి. పైగా పోటీగా ర‌జ‌నీకాంత్ `కూలీ` ఉండ‌టంతో వార్ 2 అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద పెర్ఫారెక్ట్ చేయ‌లేక‌పోతుంది. కానీ ఇరు హీరోల అభిమానులను ఖుషీ చేసే విష‌యం ఏంటంటే.. ఈ సినిమా ఓ చెత్త రికార్డ్ నుంచి జ‌స్ట్ మిస్ అయింది.


య‌శ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్ లో అత్యంత త‌క్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాగా ఎక్క‌డ వార్ 2 నిలుస్తుందో అని ఫ్యాన్స్ భ‌య‌ప‌డ్డారు. కానీ ఈ వ‌ర‌స్ట్ రికార్డ్ నుంచి వార్ 2 సేఫ్ అయింది. ఇప్ప‌టివ‌ర‌కు స్పై యూనివ‌ర్స్ లో స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ న‌టించిన `ఏక్ తా టైగ‌ర్` మూవీనే అతి త‌క్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాగా ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివ‌ర్స్ ను ప్రారంభించిన‌ మొదటి సినిమా ఇది. 2012లో రిలీజ్ అయిన ఏక్ తా టైగ‌ర్ రూ. 320 కోట్లు క‌లెక్ట్ చేసింది.


అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 మిక్స్డ్ టాక్‌తోనే ప‌ది రోజుల్లో రూ. 330 కోట్లు వసూల్ చేసింది. ఇక య‌శ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్ లో మిగ‌తా చిత్రాల విష‌యానికి వ‌స్తే.. 2017లో రిలీజ్ అయిన `టైగర్ జిందా హై` రూ. 558 కోట్లు, 2019లో వ‌చ్చిన `వార్` రూ. 471 కోట్లు, 2023 వ‌చ్చిన `ప‌ఠాన్‌` రూ. 1050 కోట్లు, `టైగ‌ర్ 3` రూ. 464 కోట్లు వ‌సూల్ చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: