
పూరి – విజయ్ సేతుపతి కాంబినేషన్ వింటేనే మాస్ ఆడియన్స్‌కు కొత్త కిక్ వస్తోంది. ఎందుకంటే పూరి సినిమాల్లో హీరో పాత్రనే మొత్తం సినిమాకు హార్ట్‌గా తీర్చిదిద్దుతాడు. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ఇమేజ్‌పై ఆధారపడని నటుడు విజయ్ సేతుపతి చేయడం అనేది డబుల్ క్రేజీ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు పూర్తయిందట. రషెస్ చూసుకున్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని సమాచారం. “ఈసారి గట్టిగా కొడతాం” అని తన దగ్గరి వర్గాలకే కాదు, టీమ్ మొత్తానికీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడట. ఇక టైటిల్ విషయంలోనూ పూరి ఈసారి కొత్తదనాన్ని చూపిస్తున్నాడు. “బెగ్గర్”, “భవతి భిక్షాందేహి” అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. టైటిల్ విన్న వెంటనే కథలో ఏదో ఇంటెన్స్ మాస్ డ్రామా ఉండబోతోందని గమనించవచ్చు.
ఇంతటితో ఆగిపోలేదు పూరి. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేశాడు. వాటిలో ఒకటిని ఒక తమిళ్ స్టార్‌తో చేయబోతున్నాడని వినిపిస్తోంది. శివ కార్తికేయన్, సూర్య – ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఫిక్స్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ టాక్. అదేకాకుండా మరో కథను తెలుగులో ఓ యూత్ స్టార్‌కి కూడా వినిపించేందుకు సిద్ధమవుతున్నాడట.మొత్తానికి పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయం అనిపిస్తోంది. విజయ్ సేతుపతి కాంబో మూవీతో సక్సెస్ సాధిస్తే, ఒకేసారి మూడు సినిమాలు లైన్లో ఉండడం వల్ల పూరి కెరీర్ మళ్లీ మాస్ లెవెల్‌లో పుంజుకునే అవకాశం ఉంది.