అక్కినేని నాగార్జున నట వారసులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అఖిల్ ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించిన ఆయనకు అదిరిపోయే రేంజ్ విజయం మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. ఈయన ఆఖరిగా ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. ఈయన కొంత కాలం క్రితం లెనిన్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా మొదలు అయిన తర్వాత ఈ మూవీ కి సంబంధించిన ఓ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఆ వీడియో ద్వారా ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ వీడియో అద్భుతంగా ఉండడం , అఖిల్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో లెనిన్ మూవీ తో అఖిల్ మంచి విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది అనుకున్నారు. ఆ తర్వాత నుండి ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక అయినా శ్రీ లీల ఈ సినిమా నుండి తప్పుకుంది. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో శ్రీ లీల స్థానంలో భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్గా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

మూవీ ని ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలి అని మూవీ బృందం భావించింది. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. లెనిన్ మూవీ తో అఖిల్  సాలిడ్ విజయాన్ని అందుకుంటాడు అని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి అఖిల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: