గత కొద్ది రోజుల నుండి ధనుష్ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ -2 మూవీ ఈవెంట్ కి ధనుష్ గెస్ట్ గా వచ్చినప్పటి నుండి మృణాల్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అంతేకాదు మృణాల్ ఠాకూర్ బర్త్డే వేడుకల్లో ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడంతో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని ఈ జంట ఎలా కలిసింది అంటూ చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు.అంతే కాదు ధనుష్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలు,ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా బయటపడడంతో చాలామంది ఈ జంటను చూసి నిజంగానే వీరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తోంది అంటూ కామెంట్లు పెట్టారు. ఇక కోలీవుడ్ మీడియా అయితే ధనుష్ మృణాల్ ఠాకూర్ లు ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఈ నేపథ్యంలోనే మృణాల్ ఠాకూర్ ఈ ప్రేమ వార్తల పై క్లారిటీ ఇస్తూ నాకు ధనుష్ తో ఎలాంటి ప్రేమ లేదు. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ చెప్పింది. కానీ సోషల్ మీడియాలో ఒక్కసారి వార్తలు గుప్పుమంటే అవి ఆగిపోవు కదా.. రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంటాయి.అలా తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన ఒక పని ధనుష్ తో లవ్ కన్ఫామ్ చేసింది అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ మృణాల్ చేసిన ఆ పని ఏంటయ్యా అంటే ధనుష్ పెట్టిన తాజా పోస్ట్ కి మృణాల్ ఠాకూర్ లైక్ చేయడమే. అయితే చాలామంది సెలబ్రిటీలు వారి మధ్య సాన్నిహిత్యం ఉంటే తప్ప ఇతరులు పెట్టే పోస్టులకి లైక్ లు చేయరు. కానీ ధనుష్ మృణాల్ ఠాకూర్ లవ్ వార్తలు వినిపిస్తున్న వేళ ధనుష్ పెట్టిన పోస్టుకి లైక్ చేయడం నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే అచ్చం ధనుష్ లాగే గతంలో ఓ జంట కూడా ప్రవర్తించింది.వాళ్లే ప్రస్తుతం భార్యాభర్తలు అయినటువంటి నాగచైతన్య శోభితలు.. గతంలో శోభిత, చైతూ ప్రేమ వార్తలు కూడా సోషల్ మీడియాలో ఇలాగే లీక్ అయ్యాయి. కానీ శోభిత నాగచైతన్య లు మా మధ్య ఏమీ లేదని కప్పిపుచ్చారు. ఇక నాగచైతన్య పెట్టిన పోస్టులకు శోభిత లైక్ చేయడం, శోభిత పెట్టిన పోస్టులకి నాగచైతన్య లైక్ చేయడంతో వీరి మధ్య ఉన్న బంధం బయటపడింది.అలా మా మధ్య ఏమీ లేదు అని చెప్పి చివరికి పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు.వీళ్ళలాగే ధనుష్ మృణాల్ జంట కూడా ఏమీ లేదు అని చెప్పి పెళ్లి పీటలు ఎక్కే వరకు వెళ్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: