తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో నారా రోహిత్ ఒకరు. ఈయన 2009 వ సంవత్సరం విడుదల అయినటువంటి బాణం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత 2018 వ సంవత్సరం వరకు నారా రోహిత్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అందులో కొన్ని సినిమాలు మాత్రమే విజయాలను అందుకున్న ఈయన ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో నటించకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ రావడంతో నటుడిగా ఈయన కంటూ మంచి గుర్తింపు వచ్చింది.

2018 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నారా రోహిత్ 2024 వ సంవత్సరం ప్రతినిధి 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. కొంత కాలం క్రితం ఈయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ లతో కలిసి భైరవం అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. తాజాగా నారా రోహిత్ "సుందరాకాండ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రేపు అనగా ఆగస్టు 27 వ తేదీన విడుదల కానుంది. గత కొంత కాలం క్రితం రవితేజ హీరోగా రూపొందిన మాస్ జాతర సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దానితో సుందరకాండ సినిమాకు రవితేజ నుండి గట్టి పోటీ ఉంటుంది అని చాలా మంది భావించారు. కానీ మాస్ జాతర సినిమా ఆగస్టు 27 వ తేదీ నుండి తప్పుకుంది. రేపు అనగా ఆగస్టు 27 వ తేదీన కొన్ని సినిమాలు విడుదల అవుతున్న వాటిపై పెద్దగా అంచనాలు లేవు. దానితో సుందరకాండ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ మంచి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది అని , అలాగే నారా రోహిత్ కూడా తిరిగి కం బ్యాక్ ఇస్తాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: