టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలను అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరు అయినటువంటి జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ టాక్ షో కి శ్రీ లీల ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ టాక్ షో లో భాగంగా శ్రీ లీల తన తల్లితో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. అసలు విషయం లోకి వెళితే  ... ఈ టాక్ షో లో భాగంగా జగపతి బాబు , శ్రీ లీల ను ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది. నువ్వు ఏ పని చేయాలి అన్న అమ్మను అడుగుతావంట. అమ్మ పర్మిషన్ తీసుకొనిదే ఏ పని చేయవు అంట. ఇది నిజమేనా అని ప్రశ్నించాడు. దానికి శ్రీ లీల సమాధానం చెబుతూ ... నా జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం అమ్మ దగ్గరే ఉంటుంది.

ఆరు నెలల క్రితం వరకు అమ్మ పక్కన లేకుండా నిద్ర కూడా పోయే దానిని కాదు. రాత్రి పక్కన అమ్మ కచ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే లేచాక వానికి పోతూ ఉంటాను. అప్పుడు అమ్మ నన్ను పట్టుకుని నార్మల్ చేస్తూ ఉంటుంది. మూవీ షూట్స్ కి వెళ్ళాలి అన్న అమ్మ పక్కన ఉండాల్సిందే. అమ్మ లేకుంటే షూటింగ్ కి కూడా వెళ్లలేను అని శ్రీ లీల తాజా టాక్ షో లో భాగంగా తనకు అమ్మతో ఉన్న అనుబంధం గురించి చెప్పుతూ ఎమోషనల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: