సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమాను ఎంత బాగా తీసాము అనే దాని కంటే కూడా ఒక  మూవీ ని ఎంత బాగా ప్రమోట్ చేసామో అనే దాని పైనే ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెద్ద స్థాయిలో ఏర్పడవు. ఆ తర్వాత సినిమా విడుదల అయినా కూడా దానికి ఓపెనింగ్స్ రాకపోవడం , దాని ఎఫెక్ట్ వల్ల సినిమా ప్రజల్లోకి వెళ్లకపోవడం , ఆ తర్వాత కూడా ఆ సినిమా పెద్ద కలెక్షన్లను వసూలు చేయకపోవడం జరిగే అవకాశం ఉంటుంది. దానితో చాలా మంది ఫిలిం మేకర్స్ సినిమాను రూపొందించడం పై ఏ స్థాయి ఇంట్రెస్ట్ ను పెడతారో ఆ తర్వాత సినిమాను ప్రమోట్ చేయడం పై కూడా అదే స్థాయిలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మూవీ బృందాలు ఓ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయాలి అంటే ముందు అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసి ఆ తర్వాత ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఓజి మూవీ యూనిట్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా డైరెక్ట్ ప్రోమో సాంగ్ లేకుండా ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ బృందం ప్రోమో లేకుండా డైరెక్ట్ గా  ఒక సాంగ్ను విడుదల చేసింది. ఈ రోజు కూడా మరో సాంగ్ ను నేరుగా విడుదల చేయనుంది. ఇలా ఈ మూవీ బృందం ఈ సినిమా సాంగ్స్ ను విడుదల చేసే విషయంలో కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk