తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ షోbలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం బుల్లి తెరపై ఎనిమిది సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకోగా , ఒక ఓ టి టి సీజన్ను కూడా కంప్లీట్ చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే తెలుగులో బిగ్ బాస్ బుల్లి తెర 9 వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆల్మోస్ట్ పనులు అన్ని పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెర పైకి వస్తున్నాయి.

కానీ ఇప్పటివరకు ఎవరు బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది అధికారికంగా కన్ఫామ్ కాలేదు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఓ స్టార్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న వ్యక్తి దగ్గర పని చేస్తూ ఆయనే ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆ కొరియో గ్రాఫర్ పై  కేస్ పెట్టింది. దానితో ఆ కొరియో గ్రాఫర్ కొంత కాలం పాటు జైల్లో కూడా ఉన్నాడు. ఇంతకు ఆ స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారా  ..?  ఆయన మరెవరో కాదు జానీ మాస్టర్. 

జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రష్ఠి వర్మ కొంత కాలం క్రితం ఆయన నన్ను లైంగికంగా వేధించాడు అని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దానితో ఆయన కొంత కాలం పాటు జైల్లో కూడా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 9 లో శ్రష్ఠి వర్మ పాటిస్పేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి నిజం గానే శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇస్తుందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: