టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా మిరాయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించాడు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. తేజ ఆఖరుగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికే మిరాయ్ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. దానితో ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులకు అద్భుతమైన పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన దాదాపు ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క కన్నడ థియేటర్ హక్కులను కూడా మేకర్స్ తాజాగా అమ్మి వేశారు. ఈ మూవీ యొక్క కన్నడ థియేటర్ హక్కులను హోంబులే ఫిలిమ్స్ మరియు వీకే ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ రెండు సంస్థలు ఈ మూవీ ని కన్నడ ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: