నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఓ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అది ఎందులో అనుకుంటున్నారా ..? డైరెక్టర్లను రిపీట్ చేసే విషయంలో. బాలకృష్ణ మునపటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో తనతో రీసెంట్గా సినిమాలు చేసిన దర్శకులకే మళ్ళీ అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. అందులో కొంత మంది విజయాలను బాలకృష్ణ కు అందించిన వారు ఉన్నారు. మరి కొంత మంది విజయాలతో పాటు అపజాయా లను అందించిన దర్శకులు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా బాలకృష్ణ ఎక్కువ శాతం తనతో ఇప్పటికే పని చేసిన వారికి మళ్ళీ అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం బాలయ్య "అఖండ 2" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో బాలకృష్ణ , బోయపాటి కాంబోలో సింహా  , లెజెండ్ , అఖండ అనే మూడు సినిమాలు రూపొందాయి. వీరి కాంబోలో అఖండ  2 నాలుగవ సినిమా. బాలయ్యమూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వీర సింహా రెడ్డి అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ , క్రిష్ జాగర్లమూడి కాంబోలో మొదటగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

ఆ తర్వాత వీరి కాంబోలో ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమాలు వచ్చాయి. ఈ మూవీలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే క్రిష్ జాగర్లమూడి , బాలకృష్ణ తో చేయబోయే సినిమాలో బాలకృష్ణ కుమారుడు అయినటువంటి మోక్షజ్ఞ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: