పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితమే హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా చాలా కాలం గ్యాప్ తర్వాత విడుదల కావడం , పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఒరిజినల్ కథతో రూపొందిన సినిమాలో నటించడంతో హరిహర వీరమల్లు సినిమాపై ఆయన అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా పవన్ నటిస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు పెట్టుకున్నది ఓజి మూవీపై. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు పాటలను విడుదల చేశారు.

మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 2 గంటల 45 నిమిషాల నిడివి అనేది స్టార్ హీరోల మూవీలకు ఎక్కువ ఏమీ కాదు ... మరి తక్కువ ఏమీ కాదు. కానీ 2 గంటల 45 నిమిషాల సినిమా అంటే కచ్చితంగా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఉండాలి. అలా కాకుండా సినిమా ఎక్కడ ఏ కాస్త బోర్ కొట్టిన అది మూవీ కి మైనస్ అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk