టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజిపై ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అవుతోంది. ప్రత్యేకంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం ఫ్యాన్స్‌కి ఎక్క‌డా లేని జోష్ ఇస్తోంది. ఓజీ రిలీజ్‌కి ఇంకా ఇరవై ఏడు రోజులు ఉన్నా ఇప్పటికే మూడు లక్షల డాలర్ల మార్క్‌ని దాటేసింది. ఈ జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా అంచనాలను మించిపోయేలా కలెక్షన్లు రాబట్టడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతం ఓజి మొదటి టార్గెట్ “కూలీ”. ప్రీమియర్స్ ద్వారా 3 మిలియన్ మార్క్ సాధించి నాలుగో స్థానంలో ఉంది. అంతకంటే ముందు “పుష్ప 2” 3.35 మిలియన్ డాలర్లతో, “ఆర్ఆర్ఆర్” 3.5 మిలియన్ డాలర్లతో, “కల్కి” 3.9 మిలియన్ డాలర్లతో టాప్‌ లిస్ట్‌లో ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్స్ ఆశలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఓజి కనీసం టాప్ 3లోకి ఎక్కాలి. అది జరిగితే “పుష్ప 2”ని దాటేసిన ఘనత ఓజికే దక్కుతుంది. అలాంటిది జరిగితే మెగా ఫ్యాన్స్ త‌లెత్తుకుని గ‌ర్వంగా కాల‌ర్ ఎగ‌రేస్తార‌న‌డంలో సందేహం లేదు.


గత కొంతకాలంగా మెగా హీరోలు వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్నారు. “భోళా శంకర్”, “మట్కా”, “గేమ్ ఛేంజర్”, “హరిహర వీరమల్లు” లాంటి ప్రాజెక్టులు ఏవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫ్యాన్స్‌లో నిరాశ అలుముకుంది. ఆ గాయాలను భర్తీ చేసే ప్రాజెక్టు ఓజి అవుతుందనే నమ్మకం వారికి కలిగింది. ఇప్పటి బజ్, అడ్వాన్స్ బుకింగ్స్‌ చూస్తుంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినాను కొత్తగా నిరూపించబోతుందని స్పష్టంగా కనపడుతోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా 25 రోజుల‌కు పైగా టైం ఉంది. నిర్మాత‌లు సరిగ్గా ప్లాన్ చేసి, ప్రమోషన్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తే ఓజి ఓపెనింగ్స్ విషయంలో కొత్త రికార్డులు ప‌క్కా రాసుకోవ‌చ్చు. ప్రత్యేకంగా కామన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కంటెంట్ అందిస్తే బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దు.


ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను సుజీత్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. తమన్ ఇచ్చిన రెండు పాటలు ఇప్పటికే ఛార్ట్‌బస్టర్స్‌గా మారాయి. వాటిలో “సువ్వి సువ్వి” ప్రత్యేకంగా మ్యూజిక్ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అసలు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్‌కి ఓజి ఒక గేమ్‌చేంజర్ సినిమాగా మారే అవకాశముంది. ఈ సినిమా విజయం మెగా ఫ్యామిలీపై పడిన డిజాస్టర్ షాడోను తొలగించి, కొత్త బాటను చూపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: