- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. తాజాగా సూపర్ యోధాగా తేజ నటించిన సినిమా మిరాయ్‌ సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రితిక నాయక్ హీరోయిన్ గా మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ శరన్, జయరాం, జగపతిబాబు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ - కృతి ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉండడంతో దేశంలోనే బడా బడా నిర్మాణ సంస్థలు .. అగ్ర  నిర్మాతలు మిరాయ్‌ పంపిణీ హక్కులు సొంతం చేసుకున్నారు. మిరాయ్‌ సినిమాకు దేశవ్యాప్తంగా టాప్ క్రేజ్ వచ్చేసింది. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు.


కర్ణాటకలో హోంబలే ఫిలింస్ - తమిళనాడులో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ - మలయాళం లో శ్రీ గోకులం మూవీస్ వారు మిరాయ్‌ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలో టాప్ లో ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు కావడం విశేషం. తెలుగులో మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు రిలీజ్ చేస్తున్నారు. టాప్ బ్యాన‌ర్ల‌ నుంచి మిరా ఈ సినిమా విడుదల అవుతూ ఉండటం కచ్చితంగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మరింత ప్లస్ అవుతుంది. సినిమా బాగుందన్న టాక్ వస్తే మరోసారి హనుమాన్ స్థాయిలో 300 కోట్లకు పైగా కొల్లగొట్టవచ్చు అన్న అంచనాలు ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: