
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ , రామ్ పోతినేని హీరోగా రూపొందిన కందిరీగ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత కూడా సంతోష్ శ్రీనివాస్ , రామ్ పోతినేని హీరోగా సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రభస కు సంబంధించిన కథను తయారు చేసుకున్నాడట. ఇక కథ మొత్తం తయారు అయ్యాక దానిని రామ్ కి వినిపించాడట. రామ్ కి కూడా ఆ కథ బాగా నచ్చినప్పటికీ ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సమయంలో ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో ఇదే కథను సంతోష్ శ్రీనివాస్ , తారక్ కి వినిపించాడట. ఆయనకు కూడా ఆ కథ సూపర్ గా నచ్చడంతో ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో సంతోష్ శ్రీనివాస్ , తారక్ హీరోగా రభస మూవీ అనే రూపొందించట. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక రొటీన్ కమర్షియల్ సినిమా అని , కొత్త దనం ఏమీ లేదు అని , జనాల నుండి , విమర్శకుల నుండి ఈ మూవీ కి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.