నందమూరి నటసింహం బాలకృష్ణ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ సినిమాల్లో చాలా మంది కి సహాయాలు చేస్తూ ఉంటాడు. కానీ నిజ జీవితంలో ఆయన కొంత మంది తో కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. దానితో బాలకృష్ణ ను దూరం నుంచి చూసే వారు చాలా మంది బాలకృష్ణ చాలా కఠినంగా ఉంటాడు అని , ఆయన ఎక్కువ శాతం జనాలపై కోప్పడతాడు అనే అభిప్రాయంలో ఉంటా ఉంటారు. కానీ ఆయనను దగ్గరగా చూసినవారు , ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవారు చెప్పే మాట వేరు. బాలకృష్ణ చాలా మంచి వారు. ఆయన ఒక్కో సారి అలా కోప్పడతారు. కానీ ఆయన గొప్ప మనసు కలవారు అని అంటూ ఉంటారు.

ఇకపోతే బాలకృష్ణ ఎన్నో సందర్భాలలో తన గొప్ప మనసును చాటుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోసారి బాలకృష్ణ తన గొప్ప మనసును చాటుకొని ఎంతో మంది కి ఆదర్శంగా నిలిచాడు. అసలు విషయం లోకి వెళితే  ... బాలకృష్ణ సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాల పాటు కొనసాగిన నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు బాలకృష్ణ కు సన్మానాన్ని నిన్న రాత్రి అనగా శనివారం రోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సన్మానంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ ... తెలంగాణ లోని కామారెడ్డి , జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి.

ఆ వర్షాలు దాటికి ప్రాణాలు కోల్పోయిన రైతులకు 50 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా CMRF కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా బాలకృష్ణ 50 లక్షల రూపాయలను తెలంగాణ ప్రాంతంలో వర్షాల వల్ల చనిపోయిన రైతుల ఆర్థిక సహాయం కోసం ఇవ్వడంతో చాలా మంది బాలకృష్ణ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణమూవీ చేయనున్నాడు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: