
తమన్నా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కొంతకాలం క్రితం బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ లవ్‌లో పడింది. లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ తో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు మూడేళ్లు విజయ్ వర్మ, తమన్నా రిలేషన్ లో ఉన్నారు. రేపో మాపో వీరు పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ భావించారు. కానీ వీరి లవ్ స్టోరీ ఎక్కువ కాలం నడవలేదు. కారణం ఏంటో తెలియదు గానీ ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది.
బ్రేకప్ తర్వాత అటు తమన్నా, ఇటు విజయ్ వర్మ ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయ్యారు. అయితే, ఇటీవల విజయ్ వర్మ మరో నటితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు పలు ఫొటోలు బయటకు రావడంతో మళ్లీ నెటిజన్స్ దృష్టి ఈ ఎక్స్ కపుల్ పై పడింది. మరొక నటితో విజయ్ వర్మ కనిపించడంపై ఓ బాలీవుడ్ మీడియా ప్రశ్నించగా.. తమన్నా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందట.
విజయ్ వర్మతో బ్రేకప్ జరిగి చాలా రోజులవుతుందని.. అలాంటప్పుడు అతను ఎవరితో తిరిగితే తనకేంటి అంటూ తమన్నా ఘాటుగా రిప్లై ఇచ్చిందట. అతను ఎవరితో తిరిగినా నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా లైఫ్, నా కేరీర్‌తో బిజీగా ఉన్నానని తమన్నా తేల్చి చెప్పినట్లు టాక్ నడుస్తోంది. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలతో ఎక్స్ రిలేషన్ వల్ల తన లైఫ్‌పై ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేసింది.