"హిట్ 1"లో మొదట హీరోగా అనుకున్నది ఎవరినో తెలుసా.. ఆ కారణంతో అలాంటి నిర్ణయం తీసుకున్న శైలేష్ కోలను..?
శైలేష్ కొలను "హిట్ ది ఫస్ట్ కేస్" మూవీ కి సంబంధించిన కథ మొత్తాన్ని తయారు చేసిన తర్వాత ఆ సినిమాలో సత్య దేవ్ గా హీరోగా తీసుకోవాలి అనుకున్నాడట. ఆ తర్వాత తెల్లవారుజామునే ఆయనకు కథను వినిపించాలి అనుకున్నాడట. ఇక అనుకోకుండా ఆ రోజు రాత్రి ఆయన సత్య దేవ్ కి సంబంధించిన ఓ సినిమాను చూడగా అందులో కూడా సత్య దేవ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో తన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ లో కూడా హీరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాల్సి ఉండటంతో వరుసగా ఒక నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో సత్య దేవ్ ఆ మూవీ లో హీరో గా తీసుకోవద్దు అనుకున్నాడట. దానితో విశ్వక్ సేన్ ఈ మూవీ లో హీరోగా తీసుకోవాలి అనుకొని ఆయనకు కథ వినిపించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సత్య దేవ్ ను మొదట శైలేష్ కొలను ఈ మూవీ లో హీరో గా అనుకున్న విశ్వక్ సేన్ తో ముందుకు వెళ్లాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి