ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నటీనటులు అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. మరి కొంతమంది నటీనటులు అనారోగ్యానికి గురై ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కేజిఎఫ్ నటుడు కూడా ఒకరు.అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందుల వల్ల పెద్దలు సహాయం చేస్తారేమో అని ఎదురుచూస్తున్నారు నటుడు హరీష్ రాయ్. వాటి గురించి చూద్దాం.


కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పని లేదు. కన్నడలో ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరోగా యష్ నటించారు. ఈ చిత్రంలో హరీష్ రాయ్ అనే నటుడు కూడా కీలకమైన పాత్రలో యష్ కి చాచా పాత్రలో నటించారు. ముఖ్యంగా హీరోకు ఆయన ఇచ్చే ఎలివేషన్స్ ఈ సినిమాకే హైలైట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. అలాంటి ఈయన గత కొద్దిరోజులుగా థైరాయిడ్ క్యాన్సర్ తో ఇబ్బందులు పడుతున్నారట . ఈ విషయంపై తనకు సహాయం చేయాలని ఒక వీడియో ద్వారా తెలియజేశారు.


నటుడు హరీష్ రాయ్ మాట్లాడుతూ.. తాను థైరాయిడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నానని, వైద్యం చేయించుకోవడానికి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని.. ఒక్కో ఇంజక్షన్ ధర రూ 3.5 లక్షల రూపాయలు అంటూ తెలిపారు. అలా ఒక్కో సైకిల్ కి మూడుసార్లు ఈ ఇంజక్షన్ తీసుకోవాలి అంటే పది లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. ఇలాంటి ఇంజక్షన్లు 20 వరకు తీసుకోవాలని ఇందుకోసం 70 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నటుడు హరీష్ రాయ్ వెల్లడించారు .తన చికిత్స కోసం ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై అటు హీరో యష్ స్పందించి మరి సహాయం చేస్తారా లేకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సహాయం చేస్తారేమో చూడాలి మరి. కానీ ఇప్పటికే ధృవ సర్జ రూ.11 లక్షల విలువైన చెక్ అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: