ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో అవకాశాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం గ్లామర్ షో చేస్తుంటారు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ ట్రెండ్ అవడం ఇప్పుడు సాధారణం. అయితే, కొంద‌రు హీరోయిన్లు అందుకు భిన్నం. అందాల ఆర‌బోత క‌న్నా త‌మ‌కున్న టాలెంట్‌తోనే అవ‌కాశాలు అందిపుచ్చుకోవాల‌ని భావిస్తుంటారు. ఆ జాబితాలో రీతు వ‌ర్మ ఒక‌రు. కానీ ఇప్పుడు రీతు వ‌ర్మ సైతం గ్లామర్ ట్రాక్‌పైకి మళ్లినట్లు ఫీలవుతున్నారు అభిమానులు.
`బాద్షా` మూవీలో చిన్న పాత్ర చేసి త‌న ఫిల్మ్ జ‌ర్నీని ప్రారంభించిన రీతు వ‌ర్మ‌.. `పెళ్లి చూపులు` మూవీతో బ్రేక్ అందుకుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో రీతు పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో మార్మోగింది. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ఛాన్సులు ద‌క్కించుకుంది.
డైలాగ్ డెలివరీ, నేచురల్ యాక్టింగ్, అందానికి ఆమె జోడించే సింప్లిసిటీ రీతు వ‌ర్మ‌ను ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. మ‌రియు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కి పర్ఫెక్ట్ అనుకునే చేశాయి. అయితే, ఇప్పుడు రీతు రూట్ మార్చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అయ్యారు.
 ఇప్పటివరకు సింపుల్ అండ్ క్లాసీ లుక్స్‌కే కట్టుబడి ఉన్న రీతు.. హాట్ ఫోటోషూట్‌తో కొత్త యాంగిల్ చూపించింది. స్టైలిష్ అవుట్‌ఫిట్‌, బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బెడ్‌పై మెండ‌లెక్కించింది. త‌న పోజుల‌తో కుర్ర‌కారు గుండెల్లో కాక‌రేపింది.
అభిమానుల్లో కొందరు రీతు బోల్డ్ లుక్‌ను ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఛీ.. ఛీ.. ఇత‌ర హీరోయిన్ల మాదిరి గ్లామ‌ర్ షోకు ఛాన్సుల కోసం ప‌రిగెట్ట‌డం అవ‌స‌ర‌మా అంటూ మండిప‌డుతున్నారు.
 కాగా, ప్రస్తుతం గ్లామర్ షో లేకుండా హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు రావడం చాలా క‌ష్టంగా మారింది. స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కాలంటే కేవలం టాలెంట్ చాలదు, గ్లామర్ కూడా మస్ట్ అనే ఫార్ములా కొనసాగుతోంది. బహుశా ఈ కారణంగానే రీతు కూడా తన ఇమేజ్‌లో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుందేమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: