ఏంటి మోహన్ లాల్ ఆ నటుడు పెద్ద స్టార్ కాకూడదని అలాంటి మందులు ఇచ్చారా.. ఇంతకీ మోహన్ లాల్ పై ఈ ఆరోపణలు చేసిన ఆ నటుడు ఎవరు? ఎందుకు మోహన్ లాల్ ఇలా ఆలోచించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మోహన్ లాల్ పై ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు మలయాళ నటుడు..దర్శకుడు..నిర్మాత..స్క్రీన్ రైటర్ అయినటువంటి శ్రీనివాసన్.. నటుడు శ్రీనివాసన్ మోహన్ లాల్ నిర్మించిన మలయాళ మూవీ కాలాపాని నటించిన సమయంలో విపరీతమైన నడుము నొప్పితో బాధపడ్డారట.ఇక తన నడుపు నొప్పి భరించలేక తన స్నేహితుడు అయినటువంటి ఓ డాక్టర్ దగ్గరికి చూయించుకున్నారట. ఆ సమయంలో శ్రీనివాసన్ ని పరీక్షించిన ఆ డాక్టర్ నువ్వు వెంటనే ఎమ్మారై స్కాన్ చేయించుకో అని చెప్పారట.

అలాగే నడుము నొప్పి తీవ్రంగా ఉంది అని,నరాల సమస్య కూడా ఉంది అని ఎమ్మారై స్కాన్ చేయించుకోమన్నారట. కానీ ఆ స్కాన్ చేయించుకోవాలంటే 10,000 రూపాయలు కావాలి. కానీ తన దగ్గర అంత డబ్బు లేదు. అలాగే మోహన్ లాల్ నిర్మిస్తున్న కాలాపాని మూవీలో శ్రీనివాసన్ చేస్తున్నప్పటికీ అప్పటికి ఇంకా రెమ్యూనరేషన్ అందలేదు.దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విపరీతమైన నడుము నొప్పితోనే కాలాపాని షూటింగ్ అండమాన్ లో జరుగుతుంటే అక్కడికి చేరుకున్నారట. ఇక విపరీతమైన నొప్పితో కనీసం కూర్చోలేని స్థితిలో ఉన్నా కూడా శ్రీనివాసన్ నటించారట. ఇక ఆయన బాధ చూసిన మోహన్ లాల్ ఏమైంది మీకు అని అడగగా..నాకు ఇలా విపరీతమైన నడుపునొప్పి వస్తుంది అని చెప్పారట.

 డబ్బులు లేకపోవడంతో ఎమ్మారై స్కాన్ చేయించుకోలేదు అనగా నడుము నొప్పిలో నిష్ణాతులైనటువంటి మోహన్ లాల్ ఎన్నో సజెషన్లు ఇచ్చారట. అయితే మోహన్ లాల్ కి నడుము నొప్పి విషయంలో ఎందుకు అంత అనుభవం ఉంది అంటే గతంలో అంటే మోహన్ లాల్ సూపర్ స్టార్ కాకముందు ఆయన కూడా విపరీతమైన నడుము నొప్పితో బాధపడేవారట. ఇక ఇండస్ట్రీలో మరో టాక్ ఏముండేదంటే.. నడుము నొప్పి వచ్చిన వారు సూపర్ స్టార్ అవుతారు అనే టాక్ ఉండేదట.అయితే ఇదే విషయాన్ని శ్రీనివాసన్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నా విపరీతమైన నడుము నొప్పికి మోహన్ లాల్ కొన్ని మందులు ఇచ్చారు. అయితే ఆ టాబ్లెట్ వేసుకోవడంతోనే నా నొప్పి ఫట్ మని వెళ్ళిపోయింది.

దాంతో ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది.ఇంతకీ మీరు నాకు ఏం టాబ్లెట్లు ఇచ్చారు అని అడిగితే..విటమిన్ సి టాబ్లెట్స్ ఇచ్చానని మోహన్ లాల్ చెప్పారు. అలాగే నాకు కూడా ఇలాంటి నడుము నొప్పి ఉండేది పొగ తాగే అలవాటు ఉన్న చాలా మందికి చలి ఉన్న సందర్భంలో ఈ నొప్పి విపరీతంగా వస్తుంది అని తెలియజేశారు. అలాగే ఇది సాధారణ నొప్పే అని చెప్పారు. ఇక ఆరోజు మోహన్ లాల్ ఇచ్చిన ఆ మాత్రలు నాకు బాగా పని చేశాయి.కానీ నడుము నొప్పి వస్తే సూపర్ స్టార్ అవుతారని అంటారు.కానీ నేను సూపర్ స్టార్ అవ్వకూడదని మోహన్ లాల్ ఆ మాత్రలు నాకు ఇచ్చారు. అలాగే మోహన్ లాల్ మనం అనుకున్నంత సాధారణ వ్యక్తి మాత్రం కాదు అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: