‘ఛత్రపతి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌కి ఓ మలుపు తీసుకువచ్చిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా మారింది. ప్రభాస్ శక్తివంతమైన యాక్షన్, భావోద్వేగాలు మేళవించిన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. శ్రియా శరణ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అందం, అభినయం రెండింటినీ సమానంగా ప్రదర్శించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా అద్భుతంగా నటించి సినిమా విజయానికి తోడ్పడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో మళ్లీ ‘ఛత్రపతి’ కాంబో రిపీట్ కాబోతుందన్న వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబో కి కారణం ‘మీరాయి’ సినిమా. తాజాగా విడుదలైన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా, రితిక నాయక్ హీరోయిన్‌గా మెరిసింది. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా రితిక నాయక్ ట్రెడిషనల్‌గా కనిపిస్తూ తన పాత్రలో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఇంట్రెస్టిగ్గా మారింది.


ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంబిక పాత్ర. ఈ పాత్రలో నటించిన శ్రియా శరణ్ మళ్లీ ఒకసారి తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంబిక పాత్ర కోసం శ్రియా చూపిన డెడికేషన్‌కి అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి శ్రియా తన స్థాయిని ప్రూవ్ చేసుకుంది. ఇక ఈ సినిమా విజయం తర్వాత మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ‘మిరాయి’లో అంబికా పాత్ర పోషించిన శ్రియ ప్రతిభతో ప్రభాస్ అంతగా ఇంప్రెస్ అయ్యి, తన రాబోయే భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజి" కోసం ఆమెకు కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ శక్తివంతమైన పాత్ర కోసం మూవీ మేకర్స్ గత కొద్దిరోజులుగా స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నారట. అనేక పేర్లను పరిశీలించిన తర్వాత అంబిక పాత్రలో శ్రియా శరణ్ ప్రదర్శన చూసిన ప్రభాస్ ఆమెనే ఈ రోల్‌కు ఫైనల్ చేశారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.



ఇది ప్రభాస్ అభిమానులకు మరో సంతోషకరమైన వార్తగా మారింది. ఎందుకంటే, ‘ఛత్రపతి’లో ప్రభాస్–శ్రియా కెమిస్ట్రీ ఎంత బాగా నడిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ఫౌజి ’లో ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను మెప్పించబోతోందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో శ్రియకు హీరోయిన్ పాత్ర కాకపోయినా, ప్రభాస్‌తో ఆమె సీన్లు సినిమాకు మరో స్థాయిలో హైలైట్ అవుతాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ‘మిరాయి’ విజయంతో తేజ సజ్జ కూడా స్టార్ హీరోల సరసన చేరాడు. రితిక నాయక్ అందం, సహజమైన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. శ్రియా శరణ్ మరోసారి తన క్లాస్ పెర్ఫార్మెన్స్‌తో గౌరవం పొందింది. ఈ నేపథ్యంలో ‘ఫౌజి’ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభాస్, శ్రియా కాంబో మరలా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందో లేదో చూడాలి. అయితే ఒక్కటే ఖాయం .. ఈ కాంబినేషన్‌పై సర్కిల్స్‌లో ఉన్న హైప్ ఇప్పటినుంచే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: