టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. రవితేజ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఈయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. హీరోగా అవకాశాలను దక్కించుకున్నాక ఈయన నటించిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ వెళ్లడంతో హీరో గా ఈయనకు అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ను ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన ఓ యువ నటిమణికి రవితేజ అంటే ఎంతో అభిమాన మాట. రవితేజతో కలిసి ఆమె ఇప్పటికే ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూడా వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రూపొందుతుంది. ఇంతకు రవితేజను అత్యంత అభిమానించే ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల. కొంత కాలం క్రితం రవితేజ హీరో గా రూపొందిన ధమాకా మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించింది.

మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత రవితేజ చాలా మూవీలలో నటించిన ఈయనకు ధమాకా సినిమా తర్వాత మంచి విజయం దక్కలేదు. ప్రస్తుతం రవితేజ , శ్రీ లీల కాంబోలో మాస్ జాతర అనే మూవీ రూపొందుతుంది. తాజాగా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా రవితేజ గురించి మాట్లాడుతూ ... నేను రవితేజ కి వీరాభిమానిని. కిక్ మరియు విక్రమార్కుడు సినిమాలను చాలా సార్లు చూశాను. నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ గా ఉండే దానిని అలాంటి సమయంలో అయన నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. అది నాకు నా కెరియర్ విషయంలో చాలా ఉపయోగపడింది అని శ్రీ లీల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt