
అయితే ఈ రెండు పాటలు మిరాయ్ చిత్రంలో కనిపించలేదు. ఈ సాంగ్స్ సినిమాలో చూపించడానికి సరైన ప్లేస్ కనిపించలేదని అందుకే ఈ రెండు సాంగ్స్ తీసి వేసామని చిత్ర బృందం తెలియజేసింది. తాజాగా నిధి అగర్వాల్ సాంగ్ ఎందుకు పెట్టలేదనే విషయం పైన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్పందించారు. ఆమెతో సాంగ్ యాచ్యువల్ గా సెకండ్ పార్ట్ కోసం చేశామని ఆ పార్ట్ లో ఆమె పాట ఉంటుందంటూ తెలియజేశారు.
సినిమా ఆఖరిలో రానాతో ట్విస్ట్ ఇస్తూ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే విధంగా హింట్ ఇచ్చామని తెలిపారు.ప్రేక్షకులకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని క్లారిటీ వచ్చింది.. కాబట్టి నిధి అగర్వాల్ సాంగు లేదని బాధపడే వారికి సెకండ్ పార్ట్ లో ఆమె కనిపిస్తుంది అంతవరకు ఎదురు చూడక తప్పదు అంటూ తెలియజేశారు. అలాగే వైబ్ ఉంది బేబీ సాంగ్ విషయంలో కూడా చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. ఈ విషయం వైరల్ గా మారుతోంది .మిరాయ్ 2 సినిమా ఎప్పుడు తెరకెక్కించి విడుదల చేస్తారో చూడాలి మరి.