
కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉన్నాయి. యూరియా నుంచి స్థానిక ఎన్నికల వరకూ.. అన్నీ సమస్యలే. ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఎవరు ఏం చేస్తున్నారో ? కూడా తెలియట్లేదు. పాలన మందగించింది.. ఫలితంగా సమస్యలు పెరిగి పోతున్నాయి. ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వారి కోసం పోరాటం చేసే వారు ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరూ కనపడడం లేదు. గద్వాలలో కేటీఆర్ సభ పెట్టారు .. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడంతో ఆయనపై యుద్ధం చేసేందుకే ఈ సభ పెట్టారే తప్పా ప్రజా కోణం ఇక్కడ ఎవ్వరికి కనపడలేదు.
ఇక ప్రతిపక్షంలో ఉండడం, ఇటు కుటుంబ గొడవలు.. కవిత సస్పెన్షన్ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ కు పూర్తిగా విరక్తి పుట్టేసినట్లుగా కనిపిస్తోంది. వరంగల్ బహిరంగసభ తర్వాత యాక్టివ్ అవుతారని అనుకున్నా కూడా ఆయనలో మార్పు లేదు.. పార్టీ పరిస్థితి ఎంత మాత్రం మారలేదు. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించి.. వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో ? అప్పుడే మళ్లీ ఆ పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో సానుకూలత మొదలవుతుంది.