డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి యాక్షన్ డ్రామా చిత్రం ఓజి. ఈ చిత్రం రేపటి రోజున భారీ స్థాయిలో ప్రేక్షకులందరికీ రాబోతోంది. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు దీటుగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి విలన్ గా నటించారు. అలాగే జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రియా రెడ్డి మరి కొంతమంది నటీనటులు నటించారు.


శ్రియా రెడ్డి ఓజి చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఓజి సినిమాలో తన పాత్రలో బాగోద్వేగాలు, శక్తి సన్నివేశాలు రెండు కలిపి ఉంటాయి. వీటివల్ల వచ్చే ఇంపాక్ట్  ఈ సినిమాకే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంటూ తెలిపింది. తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత మరింత రా ఇంటెన్షన్ గా మారుతుందని ఈ చిత్రంలో కూడా తాను పూర్తిగా మేకప్ లేకుండానే కనిపిస్తానని తెలియజేసింది శ్రియా రెడ్డి.


ఈ చిత్రానికి పనిచేసిన సినిమా ఆటోగ్రాఫర్ రవికే.చంద్రన్న ఆలోచన, ఆయన పాత్ర ఆలోచన కూడా చాలా సహజంగానే ఉంటుందని ఎప్పుడు కూడా రియలిస్టిక్ గానే కనిపించాలని కోరుకునే వ్యక్తి .. తనకు కూడా అలాంటి పాత్రలలో కనిపించడం చాలా ఇష్టమని అందుకే ఓజి సినిమాను అంగీకరించానని తెలిపింది శ్రియా. పవన్ కళ్యాణ్ తో నటించిన అనుభవం గురించి తెలియజేస్తూ.. ఆయన అందరితో చాలా తక్కువగానే మాట్లాడుతారు, ఆల్మోస్ట్ నేను కూడా అలాగే ఉంటాను. ఆయన రాజకీయ పనులను పక్కనపెట్టి మరి సినిమా షూటింగ్ కు వస్తారు కాబట్టి..ఎక్కువగా ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అందుకే తన పని మీదే ఎక్కువగా దృష్టి పెడతానని సినిమా సెట్లో సినిమాకి సంబంధం లేని విషయాలను ఎన్నో మాట్లాడాము ..ఆయనతో కలిసి పనిచేయడం ఒక అనుభవం అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: