
సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో ఈ వార్త పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు జరుగుతున్న ఇష్యూలలో ఎవరి తప్పు..? ఎవరి పొరపాటు అనేది పక్కన పెడితే, చిరంజీవి – బాలకృష్ణల మధ్య మిస్ అండర్స్టాండింగ్ మాత్రం ఉన్నట్టే అనిపిస్తోంది. ఈ కారణంగానే ఆ సీనియర్ హీరో – ఆయన భార్య మధ్యవర్తిత్వం వహిస్తూ, ఇద్దరినీ ఒకే వేదికపై కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీనియర్ కపుల్ వ్యక్తిగతంగా మీటింగ్ ఏర్పాటు చేసి, ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి సమస్యలు సర్దుబాటు చేయాలని యత్నిస్తున్నారట. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు వీరిని "బ్రోకర్లు" అంటూ ట్రోల్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం "ఇండస్ట్రీ చీలిపోకుండా ఉండాలంటే ఇలాంటి పెద్దల ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి" అని వాదిస్తున్నారు.
ఇక ఈ మొత్తం వ్యవహారం ఎటు దారితీస్తుందో తెలుసుకోవాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. చిరంజీవి – బాలకృష్ణల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం నిజంగా ఆగిపోతుందా? లేక మరింత వేడెక్కుతుందా? అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం – టాలీవుడ్ భవిష్యత్తు కోసం, వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు సర్దుబాటు కావాలని అభిమానులూ, ఫిలిం సర్కిల్స్‌లోని పెద్దలూ కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??