
మణికర్ణిక ఘాట్ నది ఒడ్డును మాత చెవి పోగు స్థలంగా పరిగణిస్తారు.. విష్ణువు ఇక్కడ ధ్యానం చేసి తన చక్రంతో మణికర్ణిక అనే బావిని తవ్వారని అతని రత్నం మరియు పార్వతి దేవి చెవిపోగు ఇక్కడ పడిపోయాయని చెబుతూ ఉంటారు. అందుకే దీనికి మణికర్ణిక అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మరణించిన శవాల పైన "94" అనే సంఖ్య రాయడం ఆచారంగా మారింది. దహనం ముందు లేదా దహనం తర్వాత కాపరి కర్రతో 94 అని శవం పైన లేదా శవం కాలిన తర్వాత మిగిలే బూడిద మీద రాసి ఉంచుతారు. ఈ సంఖ్యకు ప్రాముఖ్యత చాలానే ఉన్నది.
అక్కడ కాశీ పండితులు తెలుపుతున్న ప్రకారం.. ప్రతి మానవునికి 94 (విముక్తి యంత్ర)లక్షణాలు ఉంటాయట. మన చర్యల వల్ల ఈ లక్షణాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.. బ్రహ్మ కూడా మానవులకు ఆరు ముఖ్యమైన లక్షణాలను ప్రసాదిస్తారని.. ఈ లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉన్నవారు అన్ని సద్గుణాలను పొందుతారు.. అందుకే వృద్ధులు, కాశీలో మరణించిన వారికి దహనం చేసేటప్పుడు ఈ 94 లక్షణాలను శవానికి అంకితం చేస్తారు.94 వల్ల ఆత్మకు స్వర్గ పదం లభించి, అక్కడ మరణించిన వారి ఆత్మకు మోక్షం కలిగిస్తుందనే అక్కడి వారి ఆచారం. మణికర్ణిక ఘాట్ లోని ఈ ఆచారం కాశీని మరింత పవిత్రమైన స్థలంగా మార్చేసింది. ఎన్నో ప్రాంతాల నుంచి వృద్ధులు భక్తులు తమ చివరి రోజులలో ఇక్కడ గడపడానికి వస్తూ ఉంటారు.