
కానీ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి షో చూసిన ప్రేక్షకుల నుంచే అద్భుతమైన రివ్యూలు వెల్లువెత్తాయి. “ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక అనుభవం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆధ్యాత్మికమైన, భావోద్వేగభరితమైన ప్రయాణం” అని ప్రేక్షకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటుడిగానే కాదు, దర్శకుడిగానూ, రచయితగానూ కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఇస్తున్న రివ్యూలు మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి. “రిషబ్ శెట్టి ఒక అద్భుతమైన క్రాఫ్ట్ తో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేశాడు. కాంతార చాప్టర్ 1 కేవలం కన్నడ సినిమా కాదు.. ఇది పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయే మాస్టర్ పీస్” అని తెలుగు సోషల్ మీడియా నిండిపోయింది. ఈ రేంజ్ రివ్యూలు రావడంతో రిషబ్ శెట్టి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్, రిషబ్ శెట్టి నటన, బీ జీఎమ్, స్క్రీన్‌ప్లే, విజువల్స్ అన్నీ కలిపి ప్రేక్షకులను థియేటర్ లోంచి బయటకు వచ్చాక కూడా మైండ్‌లో హ్యాంగ్ అవుట్ అయ్యేలా చేశాయి. కొన్ని సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పించే స్థాయిలో ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి.
మొత్తం మీద, ట్రైలర్ విడుదల సమయంలో ఉన్న నెగిటివ్ బజ్ అన్నీ కరిగిపోయి, సినిమా ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ ను దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం “కాంతార చాప్టర్ 1 ఒక క్లాస్-మాస్ ఎంటర్టైనర్.. మిస్ అవ్వకూడని సినిమా” అంటూ రివ్యూలతో మార్మోగిపోతోంది.ఈ సక్సెస్ తో రిషబ్ శెట్టి కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇకపై ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత ఎక్కువగానే ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.