
ఇటీవల ఓజీ సినిమాలో కూడా అటు పవన్ కళ్యాణ్ ,ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా కలిసి కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ని విమర్శించడంతో అభిమానుల్లో కొంతవరకు వ్యతిరేకత ఎదురయ్యింది. అయితే ఇదంతా ఇలా ఉన్నప్పటికీ ఓజి చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించిన పాత్ర(సత్యా దాదా) చాలా కీలకమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ పోషించిన గంభీర్ పాత్ర కూడా విశేషమైన స్పందన వచ్చింది.ఈ రెండు పాత్రల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది.
అక్టోబర్ 1వ తేదీన ఓజి సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ,ప్రకాష్ రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నా పొలిటికల్ అభిప్రాయాలు బలంగా ఉంటాయి, అలాగే ఇతరులకు వారి అభిప్రాయాలు ఎవరికి నచ్చిన విధంగా వారికి ఉండవచ్చు.. సినిమా అంటే నాకు అమ్మ లాంటిది నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది సినిమానే..ఎవరి రాజకీయ అభిప్రాయాల వల్ల తాను నటించడంలో వెనకడుగు వేయను.. సెట్లో పొలిటికల్ టాపిక్స్ వద్దు.. ఆయన ప్రొఫెషనల్ గా ఉంటే , నేను అలాగే ఉంటానని పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో చెప్పారు.. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్ అంటూ ప్రశంసించారు. మా మధ్య ఏవైనా ఉన్న అవి వేరే చోట మాట్లాడుకుందాం ఇక్కడ కాదు .. ప్రకాష్ రాజ్ నటనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ తెలిపారు .. సినిమా షూటింగ్ సమయంలో మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే నటిస్తారా? అని అడగగా ..నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పానని తెలిపారు పవన్ కళ్యాణ్.