ఆడపడుచు అనుకుంటే సవతి అయి కూర్చుంది అని శ్రీదేవి పై వార్తలు రావడానికి ఒక కారణం ఉంది.. శ్రీదేవి చనిపోయినా కూడా ఆమె పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉంటారు.అలా తాజాగా బోనీకపూర్ లైఫ్ లోకి వెళ్లి ఆయన మొదటి భార్యను శ్రీదేవి ఇబ్బంది పెట్టింది అంటూ రచయిత  హనీఫ్  జవేరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.. ఆయన బోనీకపూర్ శ్రీదేవి ల బంధం గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి బోనీ కపూర్ కలిసింది శ్రీదేవి తల్లి సర్జరీ జరిగిన సమయంలో  ఆ టైంలో యూఎస్ కి తన తల్లిని సర్జరీ కోసం తీసుకెళ్లిన శ్రీదేవికి ఎక్కడ ఉండాలో తెలియకపోవడంతో బోనికపూర్ స్వయంగా తన ఇంట్లో ఉండమని చెప్పారు.అయితే అయితే మోనా మనసు మంచిది కాబట్టి శ్రీదేవిని తన ఇంట్లో ఉండడానికి ఓకే చెప్పింది.

 అంతేకాదు మోనా శ్రీదేవిని తన ఆడపడుచు లాగే భావించింది. కానీ శ్రీదేవి మాత్రం బోనీకపూర్ తో సరసాలు ఆడుతూ ఆయన వలలో పడిపోయింది. అలా తల్లికి సర్జరీ జరిగిన సమయంలో బోనీకపూర్ శ్రీదేవికి అన్ని విధాల అండదండగా నిలవడంతో శ్రీదేవి బోనికి చాలా దగ్గరయింది. అంతేకాదు మోనా కళ్ళముందే బోనీకపూర్ శ్రీదేవి ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఇది చూసి సహించలేని మోనా చాలా డిప్రెషన్ లోకి వెళ్లి మనసు ముక్కలయినంత పని అయింది అని తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడింది. అంతేకాదు శ్రీదేవి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది.

 ఆ ప్రెగ్నెంట్ అయిన సమయంలో తన కూతురు జీవితం నాశనం చేసింది అనే కోపంతో మోనా తల్లి ఓ ఈవెంట్లో పబ్లిక్ గా శ్రీదేవిని చెప్పు తీసుకొని కొట్టింది.ఈ సంఘటన జరిగాకే శ్రీదేవి బోనికపూర్ విషయం బాలీవుడ్ మొత్తం వైరల్ అయింది.. అలాగే బోనీ కపూర్ తో పెళ్లికి ముందే శ్రీదేవి కమిట్ అయ్యి ప్రెగ్నెంట్ అయింది.ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం మేం సీక్రెట్ గా ముందే పెళ్లి చేసుకున్నామని పెళ్లయ్యాకే ప్రెగ్నెన్సీ వచ్చిందని అబద్ధం చెప్తారు.అలా బోనికపూర్ మొదటి భార్య శ్రీదేవిని ఆడపడుచు అనుకుంటే ఆమెకే సవితి అయి కూర్చుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు బోనీ కపూర్ కి మోనా విడాకులు ఇచ్చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రచయిత హనీఫ్ జవేరి.

మరింత సమాచారం తెలుసుకోండి: