
దీనిపై కొందరు సోషల్ మీడియాలో, “ఆ పగతో దీపిక స్పిరిట్ సినిమా కథను తన పీఆర్ టీమ్ ద్వారా బయటకు లీక్ చేయించిందట!” అంటూ పుకార్లు రగిలించారు. ఈ రూమర్స్‌పై సందీప్ రెడ్డి వంగా కూడా ప్రత్యక్షంగా స్పందించి, ఘాటు గా కౌంటర్ ఇచ్చాడు. ఈ ఘటన తర్వాత దీపిక సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కి గురైంది. ఇంకా, ‘కల్కి 2’ సినిమా నుండి కూడా దీపిక ని తీసేశారని రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత కొన్ని గంటలకే అది నిజం అంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆమె ఇమేజ్‌కి గట్టి షాక్ తగిలింది. కొందరు నెటిజన్లు ఆమెను “దొంగబుద్ధి”, “సెల్ఫిష్ యాక్ట్రెస్” అంటూ విమర్శించారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆమెపై ఆగ్రహంతో మండిపడ్డారు.
అయితే అందరు ఆమెను రిజెక్ట్ చేస్తుంటే.. అల్లు అర్జున్ నటిస్తున్న అట్లీ దర్శకత్వంలోని భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొనే ని ఎందుకు తీసుకున్నారు..? దీని పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. “ప్రభాస్ సినిమా నుంచి తీసేసిన దీపికను, అల్లు అర్జున్ మాత్రం కోట్లు ఇచ్చి ఎందుకు తీసుకున్నాడు?” అని ఘాటు గా మాట్లాడుకున్నారు. ఇండస్ట్రీలో చాలామంది కూడా ఇదే ప్రశ్నతో ఆశ్చర్యపోతున్నారు. కొందరు విశ్లేషకులు మాత్రం, “అల్లూ అర్జున్‌కి మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అందుకే ఆయన తన సినిమాకి గ్లోబల్ ఫేస్ కావాలనుకున్నారు. అందుకే దీపికను తీసుకున్నారని” అంటున్నారు.
అయితే మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం వేరే వాదన చేస్తున్నారు — “తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దీపికను దూరం పెడుతుంటే, అట్లీ మాత్రం ఆమెను ఎందుకు ఎంచుకున్నాడు?” అంటూ సోషల్ మీడియాలో ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.ఇక దీపిక అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ స్టార్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. “దీపిక తన ప్రతిభతో, తన కష్టంతో ఈ స్థాయికి వచ్చింది. ఆమెను ఎవరు దూరం పెట్టలేరు. ప్రతిసారి నెగిటివిటీని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తోంది. అదే ఆమె స్పిరిట్!” అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినీ వర్గాల పెద్దలు మాత్రం ఒకే మాట అంటున్నారు — “ఇది ఎవరి తప్పు ఎవరి ఒప్పో అనడం కష్టమే. కానీ, ఎవరి కెరీర్ వారు చూసుకోవడం మంచిది. ఇండస్ట్రీలో ఇలాంటి అపోహలు సహజం. కాస్త సైలెంట్‌గా ఉండటం బెటర్.”ఇలా దీపిక పదుకొనే పేరు చుట్టూ మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. ప్రభాస్ సినిమాతో మొదలైన ఈ గాసిప్స్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి లింక్ అయి, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు..!