
మొదట రష్మిక మందన్న పేరు పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, “ప్రతి సినిమాలో రష్మికనే తీసుకుంటే ఏం కొత్తదనం ఉంటుంది?” అనే ఆలోచనతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, “కాంతారాన 1” మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రుక్మిణి వసంత్ పేరు ముందుకు వచ్చింది. ఆమె నటన, ప్రెజెన్స్ సుకుమార్‌కు బాగా నచ్చడంతో, చివరికి మూవీ మేకర్స్ రుక్మిణి వసంత్‌నే హీరోయిన్‌గా ఫైనల్ చేశారని తాజా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే, “రంగస్థలం” సినిమాలో ఆది పినిశెట్టి చేసిన శక్తివంతమైన క్యారెక్టర్‌ను ఈ సీక్వెల్‌లో అర్జున్ దాస్ చేయాల్సి ఉందని వార్తలు వచ్చాయి. ఆయన సెలక్షన్‌పై ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్‌మెంట్ నెలకొంది. అయితే తాజాగా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది — అర్జున్ దాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట!
వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. అర్జున్ దాస్ అడిగిన రెమ్యూనరేషన్ మూవీ మేకర్స్ ఇవ్వలేకపోవడంతో ఆయన స్వయంగా ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. కథా కాన్సెప్ట్ బలంగా ఉన్నప్పటికీ, రేమ్యూనరేషన్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగానే అర్జున్ దాస్ వైదొలిగినట్లు ఇండస్ట్రీ టాక్.ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. “ఓజీ” సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని బీట్ చేస్తూ అర్జున్ దాస్ ఇచ్చిన అద్భుతమైన నటన, వాయిస్ బేస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నటుడు తెలుగు సినిమా నుండి తప్పుకున్నాడంటే, ఫ్యాన్స్ నిరాశ చెందడం సహజం.
ఇప్పుడు సుకుమార్ తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు “సుకుమార్ తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నాడేమో” అంటుంటే, మరికొందరు “అర్జున్ దాస్ లేకపోయినా సుకుమార్ కథే విజయం సాధిస్తుంది” అంటూ డైరెక్టర్‌ను సమర్థిస్తున్నారు.ఏదేమైనా, రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రంగస్థలం స్థాయిలోనే కాకుండా దానిని మించే స్థాయిలో ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు చూడాలి — రుక్మిణి వసంత్ మ్యాజిక్, సుకుమార్ క్రియేటివిటీ, చరణ్ ఎనర్జీ కలిస్తే ఏమి వింత జరుగుతుందో..???